ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు ఎవరితో పెళ్లి జరగాలో నిర్ణయిస్తారు.... ఎలాగంటే?
TeluguStop.com
సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళిన ముందుగా మనకు వినాయకుడి దర్శనం ఇస్తారు.
ఇలా వినాయకుడు మనకు నాలుగు చేతులతో, ఏకదంతం తో దర్శనమిస్తారు.ఈ విధంగా ఆలయంలోకి వెళ్లగానే ముందుగా వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఆలయంలో కొలువైన స్వామి వారిని దర్శనం చేసుకుంటాను.
ఈ విధంగా వినాయకుడికి నమస్కరిం చడం వల్ల మన పై ఉన్న విఘ్నాలను తొలగించే గణపతి మన పెళ్లి ఎవరితో జరగాలో కూడా నిర్ణయిస్తారట.
అయితే ఈ విధంగా పెళ్ళిళ్ళను నిర్ణయించే గణపతి ఆలయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని హెన్నావరలోని ఇడగుంగిలో ఈ విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది.ఇక్కడ స్వామి వారు నిలబడి రెండు చేతులతో దర్శనం ఇవ్వడమే కాకుండా రెండు దంతాలతో భక్తులకు దర్శనమిస్తారు.
ఇక్కడ స్వామివారి వాహనమైన ఎలుక కూడా మనకు దర్శనం ఇవ్వదు.పురాణాల ప్రకారం 15 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామి వారికి ఓ విశిష్టత ఉంది.
ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా వారి పిల్లలకు వివాహం చేయాలని భావిస్తే వారికి వచ్చిన సంబంధానికి సంబంధించిన వారి పేర్లను స్వామి వారి పాదాల వద్ద ఉంచుతారు.
"""/"/
ఈ క్రమంలోనే వధూవరులు ఇద్దరూ ఆలయానికి చేరుకుని చీటీలు రాసి స్వామి వారి పాదాల వద్ద ఉంచుతారు.
స్వామివారి కుడిపాదం దగ్గర పెట్టిన చీటీ కిందికి పడితే అప్పుడు స్వామి వారు వారిద్దరి పెళ్లిని నిర్ణయించినట్టు.
అలా పడకపోతే ఎలాంటి పరిస్థితులలో కూడా వారిద్దరికీ పెళ్లి చేయరు.అందుకే ఈ ఆలయంలో వెలసిన స్వామి వారిని వివాహాలు నిర్ణయించే గణపతిగా పూజిస్తారు.
ఈ క్రమంలోనే స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వెళుతుంటారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, మంగళవారం2024