సంచలనం సృష్టిస్తున్న సర్వే.. నెక్స్ట్ ఎవరు ?
TeluguStop.com
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి.పోలిటికల్ హీట్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.
2024 ఎన్నికల కోసం కేవలం ప్రధాన పార్టీలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందా ? లేదా ప్రజలు టీడీపీకి పట్టం కడతారా ? జనసేన సంచలనం సృష్టించబోతుందా ? ఇలాంటి ప్రశ్నలు హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.
ప్రభుత్వం అధిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లభ్ది పొందిన ప్రజలు వైసీపీకే అండగా నిలుస్తారని, వైఎస్ జగన్ భావిశిస్తుంటే.
లేదు లేదు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం అని తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట.
"""/" /
మరోవైపు గతంలో కంటే జనసేన బలం బాగా పెరగడంతో ఈసారి జనసేన సంచలనం సృష్టించే అవకాశం ఉందని మరికొందరి వాదన.
అయితే వీటన్నిటికి కాస్త పక్కన పెడితే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనే దానిపై ఎస్ ఏ ఎస్ గ్రూప్ నిర్వహించిన సర్వే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
2019 నుంచి 2022 వరకు రాష్ట్రంలోని బలాబలాలను బేరీజు వేసుకొని ఈ సర్వేను నిర్వహించినట్లు సమాచారం.
ఎస్ ఏ ఎస్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికేప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 78-81, వైసీపీ 63-72, జనసేన 6-7 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందట.
మరో 27 స్థానాల్లో మూడు పార్టీల మద్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందట.
"""/" / ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళితే 110-115 స్థానాలను, 65-68 స్థానాలను కైవసం చేసుకుంటాయని, మరో 10-12 స్థానాల్లో పోటాపోటి నలకొనే అవకాశం ఉందని ఎస్ ఏ ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడిచింది.
దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారే అవకాశం ఉందనేది కొందరి మాట.
అయితే సర్వేలను బట్టి ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా అంచనా వేయలేమనేది మరికొందరి మాట.మొత్తానికి ఆయా రిపోర్ట్స్ ఇచ్చిన సర్వేలను పరిశీలిస్తే.
జగన్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం స్పష్టమౌతోంది.
మరి 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ గా రిచ్ అవుతారా ? అసలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా ? ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే సిఎం అభ్యర్థి ఎవరు అనే విషయాలు కూడా హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.
మరి వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
ఈ దర్శకులు రాజమౌళి దారిలోనే నడుస్తున్నారా..?