వివేక హత్య కేసు విచారణ విషయంలో సీరియస్ అయినా సుప్రీం..!!
TeluguStop.com
వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు విషయంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) సీరియస్ అయ్యింది.
వివేక హత్య కేసు విచారణ ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.దర్యాప్తు పూర్తిగా చేయకపోవడంతో పాటు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీబీఐని( CBI ) ప్రశ్నించింది.
వివేక హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది.ఇప్పటివరకు జరిగిన పూర్తి విచారణకీ సంబందించింది సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
"""/" /
దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయటం లేదని.విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ అంశంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం తెలుసుకొని.న్యాయస్థానానికి తెలియజేస్తామని సీబీఐ తరపు లాయర్ సమాధానమిచ్చారు.
కేసు విచారణ ఆలస్యంపై.నిందితుడు శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.వివేక హత్య కేసులో విచారణ ఆలస్యంపై సీబీఐ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.