ముఖ్యమంత్రికి చెక్ అందచేసిన సూపర్ స్టార్ దంపతులు.. మరో రూ.10 లక్షలు కూడా..
TeluguStop.com
కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల కారణంగా వరద బాధితుల సహాయం కోసం సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) కోటి రూపాయలు ప్రకటించారు.
ఇందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో 50 లక్షలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి మహేష్ బాబు, భార్య నమ్రత శిరోద్కర్ ( Namrata Shirodkar )కలిసి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
అయితే చెప్పిన దానికంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మరో 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
"""/" /
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి అందజేశారు మహేష్ బాబు దంపతులు.
వారిద్దరు కలిసి ముఖ్యమంత్రికి 50 లక్షల చెక్కును అందించారు.ఆ తర్వాత AMB తరఫున మరో 10 లక్షల రూపాయలను కూడా మహేష్ బాబు ముఖ్యమంత్రికి విరాళంగా అందజేశారు.
దీంతో మొత్తం తెలంగాణకు మహేష్ బాబు 60 లక్షల రూపాయల వరద సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహేష్ దంపులతోపాటు ఏఎంబి సంబంధించిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇక సినిమాల పరంగా చూస్తే.ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29( SSMB 29 ) పేరుతో రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో మహేష్ బాబు లుక్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా మహేష్ బాబు హెయిర్ స్టైల్ సంబంధించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
షాకిచ్చిన ట్రంప్ .. ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జిన్‌పింగ్‌కి ఆహ్వానం?