సక్సెస్ స్టోరీ: చెత్తకుండిలో చిన్నారిని చేరదీసాడు..అసిస్టెంట్ కమిషనర్ అయి తండ్రిముందు నిలబడింది.

'యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత.' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతులు కొలువై ఉంటారు.

మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పిన విషయమిది.కానీ నేడు పరిస్థితి అంతా తారుమారైంది గడియకో అత్యాచారం,పూటకో హత్య పేరుతో స్త్రీలను వేధించేవారే ఎక్కువయ్యారు.

మరికొందరైతే పుట్టకముందే చంపేస్తుంటే,ఇంకొందరు పుట్టాక ఆడపిల్ల అని తెలిసాక చెత్తకుప్పల పాలు చేస్తున్నారు.

అలా కళ్లు తెరవకముందే చెత్తకుండీ పాలైన ఒక చిన్నారి విధిని ఎదిరించి విజయాన్ని ఎలా సాధించింది.

తనకు తోడు నిలిచిన పెంపుడు తండ్రి కథ మీకోసం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అసోంలోని తీన్ సుఖియా జిల్లాకు చెందిన సోబరన్‌‌ బండిమీద కురగాయలు పెట్టుకుని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు.

తల్లి దండ్రులు ఇద్దరూ పెద్దవారు కావడం వారిని చూసుకునే బాధ్యత తనపై పడడంతో పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించలేకపోయాడు.

రోజులానే ఓ రోజు కూరగాయలు అమ్మి చీకటి పడిన తరువాత ఇంటికి తిరగి వస్తున్నాడు.

ఇంతలో ఓ చిన్నారి ఏడుపు వినిపించింది.తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది.

పరుగున వెళ్లి చుట్టూ చూశాడు.పాప తాలూకూ ఎవరూ కనిపించలేదు.

ఏజన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు.అమ్మానాన్నా అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు.

చిన్నారి రాకతో సోబరన్ జీవితం మారిపోయింది.తన జీవితంలో వెలుగులు పంచిన ఆ చిన్నారికి జ్యోతి అని పేరు పెట్టాడు.

రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కోసం తండ్రి పడే తపన, కష్టం అంతా జ్యోతి కోసం పడ్డాడు సోబరన్.

మంచి స్కూల్లో జాయిన్ చేశాడు.బాగా చదవాలంటూ ప్రోత్సహించాడు.

జ్యోతి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ తండ్రిగా అందమైన కలలు కన్నాడు.

కష్టం తెలియకుండా, కన్నీళ్లు రానివ్వకుండా జ్యోతిని పెంచి పెద్ద చేశాడు.ఫలితంగా జ్యోతి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది.

అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరైంది.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.

ఇంటర్వూలో కూడా విజయం సాధించి ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ బిడ్డ విజయాన్ని చూసిన తండ్రి సోబరన్ కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోతే,కళ్లనీళ్లతో తండ్రిని చూసి జ్యోతి తల్లడిల్లిపోయింది.

వీధిపాలు కావలసిన జీవితాన్ని విద్యావంతురాలిని చేసి ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టిన తండ్రికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది.

ఆడపిల్ల అని ఛీకొట్టే ఎందరో తల్లిదండ్రులకు సోబరన్,జ్యోతిల జీవితం ఒక ఆదర్శం.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!