పరీక్షలో వెరైటీగా కాపీ కొట్టిన స్టూడెంట్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
TeluguStop.com

చాలామంది స్టూడెంట్స్ కష్టపడి చదువుకుంటుంటే కొందరు మాత్రం ఏం చదవకుండా ఎలాగోలా కాపీ కొట్టి పాస్ కావాలని అనుకుంటుంటారు.


అయితే ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని దొరకకుండా కాపీ ఎలా కొట్టాలో విద్యార్థులు ఆలోచనలు చేస్తున్నారు.


కాగా ఒక్కోసారి వారి కాపీ కొట్టే ఐడియాలు, టెక్నిక్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ఇంత గొప్ప ఆలోచన ఎలా చేశారబ్బా అని అనుకోవడం అందరి వంతు అవుతుంది.
కాగా ఆ తరహా కాపీ టెక్నాలజీని ఒక స్టూడెంట్ కనిపెట్టాడు.దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక పెన్స్ పౌచ్ కనిపించడం మీరు చూడవచ్చు.ఆ పౌచ్ లోపల పెన్నులు, పెన్సిళ్లు ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.
కానీ నిజంగా అవి పెన్నులు పెన్సిళ్లు కావు.ఆ పౌచ్ లోపల ఒక డివైజ్ ఉంది.
దాని స్క్రీన్‌పై పెన్నులు, పెన్సిళ్ల పిక్ ఉంది.దీనివల్ల నిజంగా అది ఒక పౌచేనేమో అనే భ్రమ కలుగుతుంది.
కాకపోతే అదంతా అబద్ధం.ఆ పిక్చర్ తీసివేసి అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇందులో ఫొటోలుగా ఉన్నట్లు మీరు చూడవచ్చు.
అలా ఓ స్టూడెంట్ ఎగ్జామ్‌లో కాపీ కొట్టడానికి అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ వీడియోను ట్విట్టర్ పేజ్ @bornAKang షేర్ చేసింది.'దిస్ ఈజ్ ఎక్స్‌పర్ట్ లెవల్ చీటింగ్' అని ఓ క్యాప్షన్ కూడా జత చేసింది.
నెటిజన్లు ఈ వీడియో చూసి స్మార్ట్ ట్రిక్, బ్రిలియంట్ అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.
కళ్యాణ్ రామ్ గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!