నరకం చూపుతున్న గ్రామ సింహాలు వణికిపోతున్న గ్రామస్తులు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం( Anantha Giri )లో ఒకవైపు విషజ్వరాలు, మరోవైపు వీధి కుక్కలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

మండల పరిధిలోని కొత్త గోల్ తండాలో వీధికుక్కల స్వైర విహారంతో చిన్న పిల్లలు, వృద్దులు,మహిళలు బయటికి అడుగు పెట్టాలంటే జంకుతున్నారు.

ఇంటి ముందు కాపలా కాస్తున్నట్లుగా గుంపులుగా ఉండడంతో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

పాలక మండలికి ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎవరికైనా ప్రమాదం జరిగితే గాని అధికారులు స్పందించరా?అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోదాడ డంపింగ్ యార్డ్ పాత గోల్ తండా గ్రామ శివారులో ఉండడంతో మున్సిపల్ సిబ్బంది వేసే చెత్తా చెదారాల వాసనలకు కుక్కలు( Street Dogs ) గుంపులుగా ఇక్కడి చేరుకొని గ్రామాల మీద పడుతున్నాయని, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కుక్కలను ప్రత్యేకమైన వ్యాన్ లో తీసుకువెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Hajper Customer Support And Service Quality: A Practical Guide For UK Players