ఇదేందయ్యా ఇది.. పెళ్లి భోజనానికి బిల్లు కట్టాలని వధువు వింత రూల్..!

భారతదేశంలో పెళ్లిళ్లలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది పెళ్లి భోజనం అని చెప్పవచ్చు.పెళ్లి భోజనంలో దొరికే పంచభక్ష పరమాన్నాలు తినేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.

పెళ్లిలో విందు భోజనం కడుపు నిండా తినకుండా ఎవరూ ఉండలేరు.అయితే బంధుమిత్రులందరికీ రుచికరమైన వంటకాలు వండి పెట్టడానికి వధూవరుల బంధువులు భారీగానే ఖర్చు చేస్తారు.

అయితే తాజాగా ఒక వధువు తన పెళ్ళిలో పెట్టే భోజనాలకు బిల్లు వసూలు చేస్తానని చెప్పింది.

ఈరోజుల్లో ప్రతిదీ ప్రియంగా మారిందని, భోజనాలు ఖర్చులను తన కుటుంబం భరించలేదని, అందుకే భోజనం చేసిన ప్రతి ఒకరి దగ్గర డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

సోషల్ మీడియాలో తన ఐడియా గురించి వెల్లడించింది.అయితే దీనిని చూసి నెటిజనులు అవాక్కవుతున్నారు.

"మీలో ఎవరైనా మీ అతిథుల నుంచి భోజనానికి డబ్బులు అడిగారా? ప్రస్తుతం ప్రతిదీ కూడా బాగా ఖరీదైనవిగా మారిపోయాయి.

అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలా వాయిదా వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా.లేదంటే బహుమతులకు బదులుగా అతిథుల నుంచి భోజనానికి డబ్బులు వసూలు చేయాలని యోచిస్తున్నా.

ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించా.భోజనాలకి బిల్లు వసూలు చేయడం ఎలా జరుగుతుందో ఏమో.

నాకు చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది హెల్ప్ చేయండి" అని వధువు ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది.

ఇదే పోస్టును రెడ్డిట్ గ్రూప్ R/weddingshaming లో కూడా షేర్ చేశారు.దీంతో ఇది వైరల్ గా మారింది.

"""/"/ ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి భోజనానికి ఎవరైనా డబ్బులు అడుగుతారా? అని, ఆ వధువు ఐడియా చాలా చండాలంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

అందరికీ కాకుండా కేవలం 30 మందిని పిలిచి వారికి ఉచితంగానే భోజనం పెడితే మిమ్మల్ని ఎవరు ఏమంటారు? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కు భారీ షాకిచ్చిన బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?