వ్యాపారంలో వృద్ధి చెందాలంటే..ఈ రంగులో ఉండే హనుమంతుడిని పూజించాల్సిందే!

సాధారణంగా మనకు ఏదైనా భయాందోళన కలిగితే మొదటగా మనం అనుకునే పదం శ్రీ ఆంజనేయంప్రసన్నాంజనేయం.

ఇలా మనకు భయాందోళనలు కలిగినప్పుడు మనకు ధైర్యం ప్రసాదించడానికి ప్రతి ఒక్కరు ఆంజనేయస్వామిని కొలుస్తారు.

ఆంజనేయస్వామి ధైర్యానికి బలానికి ప్రతీకగా చెప్పవచ్చు.రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం శనివారం భక్తుల విశేష పూజలను నిర్వహిస్తారు.

ఈ విధంగా ఆంజనేయస్వామిని పూజించడం కోసం అనేక ప్రతిమలు ఉన్నాయి.ఒక్కొక్కరు ఒక్కో విధమైన ప్రతిమను పూజిస్తూ ఉంటారు.

అయితే ఏ రూపంలో ఉన్నటువంటి హనుమంతుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం మనం ఏదైనా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలన్న, ఇంట్లో ఎటువంటి సమస్యలైనా తొలగిపోవాలంటే మన ఇంట్లో ఉత్తరాభిముఖం అంటే దక్షిణం వైపున హనుమంతుడిని పూజించాలి.

ఇలాంటి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల దేవ దేవతల ఆశీర్వాదం పొందుతారు.ఈ విధమైనటువంటి ఆంజనేయస్వామి ప్రతిమను పూజించడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడు మనశ్శాంతి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

"""/"/ చాలామంది ఉద్యోగాలలో, వ్యాపార రంగంలో ఆర్థికంగా ముందుకు రావాలని భావిస్తుంటారు.ఇలా వృత్తి పరంగా ఆర్థిక అభివృద్ధి వృత్తిలో ఏవైనా సమస్యలు ఉంటే అలాంటి వారు శ్వేత రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వృత్తిలో అభివృద్ధి పొందడమే కాకుండా వ్యాపార రంగాలలో లాభాలను ఆర్జిస్తారు.

అదేవిధంగా శ్రీరామచంద్రుకి పూజ చేస్తున్నటువంటి ఆంజనేయ విగ్రహం ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు.

అలాగే కోరిన కోరికలు నెరవేరాలంటే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ఎంతో శ్రేయస్కరం.

ఈ విధంగా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే 41 మంగళవారాలు, శనివారాలు ఆంజనేయుడికి పూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే వీసా ఇంటర్వ్యూ స్లాట్లు..