గ్రామ వీధుల్లో వెదజల్లుతున్న దుర్వాసన…!

నల్లగొండ:గ్రామ పంచాయతీ( Gram Panchayat ) కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ గత తొమ్మిది రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా సమ్మె బాటలో ఉండడంతో గ్రామంలోని పారిశుద్ధ్యం పడకేసింది.

వీధులు శుభ్రం చేసే వారు లేక,ఇండ్లలో చెత్తాచెదారం బయట వేయడంతో గ్రామాలన్న అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

మురికి కాలవలు తీయకపోవడంతో వీధులలో దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు.వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, గ్రామాలలో వీధులను శుభ్రం చేయకపోవడం బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం వీధులలో కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు .

సిబ్బంది సమ్మెలో ఉంటే కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులకు నియమించుకొని పనులు చేయించాలని అధికారులు ఆదేశించినా సమ్మె చేస్తున్న సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు.

కొన్ని గ్రామాల్లో ఈ పనిని చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని తెలుస్తుంది.గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) త్వరగా పరిష్కరించి,గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని,లేనియెడల గ్రామాల నుండి ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయని అంటున్నారు.

గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలను తప్పక తీసుకోండి!