అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం

విశాఖ: పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత, శేష గిరి రావు మాట్లాడుతూ.

అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలి.పోలీసులు ఏం పీక్కుతున్నారని అయ్యన్న అనడం అమానుషం.

వరదల్లో బాధితులను కాపాడే  ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను చూడండి.అయ్యన్న తో తెల్చుకుంటామని మా పోలీసులు అంటున్నారు.

కానీ మా అధికారులు సంయమనం తో వుండాలని కోరారు.అయ్యన్న పోలీసులను తరిమి కొడతానన్నారు.

అది పోలీసులకు కొత్త కాదు మాకు ఆ అంశాలు ట్రైనింగ్ లోనే నేర్పారు.

పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అయ్యన్నకు తగదు.అయ్యన్న పాత్రుడు మాట తీరు ఇబ్బంది కరంగా వుంది.

బట్టలు విప్పి తంతానన్న అయ్యన్న ఈ ఖాకీ దుస్తులు మీరు ఇవ్వలేదని గుర్తు చేసుకోండి.

అయ్యన్న పాత్రుడు లా మాట్లాడే వ్యక్తులను అరెస్ట్ చేయాలి.పోలీసులకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నీ సమానమే.

టీడీపీ  హయాంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లో పనిచేస్తున్నారు.

అప్పుడు మంచి పోలీసులు ఇప్పుడు చెడ్డవారిగా ఎలా మారుతారు.

ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ అంత రేట్ కి అమ్ముడుపోయాయా..?