తడిచిన ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ
TeluguStop.com
హైదరాబాద్ : మే 02అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అగమైపోతున్నారు.గత పది రోజులుగా వరణడు సృష్టిస్తున్న బీభత్సానికి ఆరుగాలం కష్టపడి రైతన్నలు పండించిన పంట అంతా నీటిపాలైంది.
చాలా వరకు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యమంతా వానకు తడిచిపోయింది.
ఈ తడిచిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు.ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై సచివాలయంలో మంత్రి అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇటీవల మునుపెన్నడూ లేని విధంగా కురుస్తున్న అకాల భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరు, కొనుగోలు కేంద్రాల వద్ద తాజా పరిస్థితులు, ఇతర ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు.
మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి అత్యవసర బాయిల్డ్ రైస్ కోసం ఉత్తర్వులు ఇచ్చామని.
సేకరణ జరుగుతున్న రీతిలో పెంచుతామని తెలిపారు.
రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?