స్వచ్ఛదనం…..పచ్చదనానికి శ్రీకారం ఈ నెల 5 నుంచి 9 వ తేదీ దాకా జిల్లాలో కార్యక్రమాలు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
TeluguStop.com
పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం.పచ్చదనానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ నెల 5 వ తేదీ నుంచి 09వ తేదీ దాకా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
రోజు వారిగా చేయాల్సిన పనుల ప్రణాళికను విడుదల చేసింది.వార్డు, గ్రామ పంచాయతీ టీమ్ సభ్యులు రోజూ ఆయా కార్యక్రములు పర్యవేక్షిస్తూ.
కలెక్టర్ నివేదించాలి.మొదటి రోజున.
ఈ నెల 5 వ తేదీన స్థానిక నాయకులు, మహిళా సంఘాలు, యూత్, వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, ర్యాలీ తీయనున్నారు.
మహిళా సంఘాల సమావేశంలో ప్రచార చిత్రాల ద్వారా వీధి కుక్కల బెడద, ఇంటి స్థాయిలో చెత్తను వేరు చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాల ఫై చర్చించాలని, అవగాహన కల్పించాలని సూచించింది.
అన్ని గృహాల నుంచి వేరు చేయబడిన వ్యర్థాలను సేకరించడం, కంపోస్ట్ తయారు చేయాలని తెలిపింది.
పాఠశాలల్లో పారిశుధ్యం, తోటల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకంతో కలిగే దుష్పరిణామాల పై ప్రసంగం, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని, వీధులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయాలని, ఏరియాల వారిగా శుభ్రత, రోజువారీ ప్రాతిపదికన చెత్త హాని కలిగించే పాయింట్ల పై దృష్టి పెట్టాలని ఆదేశించింది.
ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్‌వాడీ లు, హాస్టళ్లు, పీహెచ్‌సీ లు, బస్ స్టాప్ లు, ఇతర ప్రభుత్వ స్థలాలు శుభ్రం చేయాలని సూచించింది.
అన్ని పారిశుద్ధ్య వాహనాలకు స్వచ్చ ఆటో, ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఇన్‌స్టాలేషన్ చేయాలని, ప్లాస్టిక్ నిషేదంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గోడలపై వాల్ పేయింటింగ్ వేయించాలని, ప్రజలతో శ్రమదానం చేయించాలని, జంగిల్ క్లియరెన్స్ రోడ్లు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపింది.
మరుగుదొడ్లు లేని గృహములను గుర్తించి, వారికీ 15 రోజులలో నూతనంగా అనుమతులు ఇచ్చి పూర్తి చేయించాలని ఆదేశించింది.
రెండో రోజున.త్రాగునీరు/వాననీటి హార్వెస్టింగ్ :
అన్ని తాగునీటి వనరులు శుభ్రం చేయాలని, రోజూ క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే ప్రజలకు సరఫరా చేయాలని, క్లోరినేషన్ స్థాయిలు (PPM స్థాయిలు) క్లోరో స్కోప్‌లు కిట్స్ ద్వార టెస్ట్ చేయాలని ఆదేశించింది.
త్రాగునీటి సరఫరా సరిగా లేని ప్రాంతాలకు దృష్టి పెట్టాలని సూచించింది.300 చదరపు గజాల విస్తీర్ణం గల భవనాలను గుర్తించి, యజమానులకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ద్వార నీటి నిల్వ పద్దతుల పై అవగాహన కల్పించాలని, సరస్సులు, చెరువులు మొదలైనవి సందర్శించి, వాటిని పునర్ జీవింప చేయడానికి చర్చించి ఏర్పాట్లు చేయాలని తెలిపింది.
మూడో రోజున.డ్రెయిన్లు, వాటర్ స్టాగ్ నెంట్ ఏరియాలు/గుంతలు పూడ్చడం:మురికి కాలువల్లో పూడిక తీయించాలని, లోతట్టు ప్రాంతాలు, నీటి నిల్వగల ప్రదేశములను గుర్తించి, మొరం నింపాలని, నిల్వ నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని, మురికి కాలువల చివర, నీటి పారుదల సౌకర్యం లేని, నీటి నిల్వ గల ప్రదేశాలలో కమ్యూనిటి సోక్ పిట్స్ లేదా ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించింది.
అన్ని ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ స్థలాలు శుభ్రం చేయించాలని తెలిపింది.నాలుగో రోజున మహిళా సంఘాలు బాధ్యులు, ఆశాలు, పాఠశాల సమావేశాల్లో డెంగ్యూ, మలేరియాపై అవగాహన కల్పించాలని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలలో అన్ని సర్వేలు నిర్వహించాలని ఆదేశించింది.
ఏదైనా ప్రాంతంలో జ్వరాలు బయటపడితే ఇంటెన్సివ్ క్లీనింగ్, యాంటీలార్వాల్, ఫాగింగ్ చర్యలు అట్టి ఏరియాలో చేపట్టాలని, దోమలను నిరోధించే ఆయిల్ బాల్ తగినంత సంఖ్యలో తయారు చేసుకొని, వాటిని నీరు నిల్వ ప్రదేశాల్లో విడుదల చేయాలని తెలిపింది.
యాంటీ-లార్వా రసాయనాలు (పైరెత్రమ్/టెమోఫోస్) పిచికారీ చేయాలని, ఫాగింగ్ (మలాథియాన్) ప్రతిరోజూ చేయాలని సూచించింది.
పట్టణ స్థానిక సంస్థలలో జంతు జనన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, పశుసంవర్ధక శాఖ వారి సమన్వయంతో వీధి కుక్కల సర్వే నిర్వహించాలని ఆదేశించింది.
ఆఖరి రోజున పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్/పబ్లిక్ స్థలాలు శుభ్రం చేయాలి.ప్రతి శుక్రవారం గ్రామపంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలోని అన్ని గృహాలను సందర్శించి ఆవరణలో ఉన్న అన్ని నీటి నిల్వలు తొలగించాలని, అన్ని గృహాల్లో ఉపయోగించని వస్తువులను వారి ఇంటి నుంచి తొలగించాలని ఆదేశించింది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో డ్రై డే నిర్వహించాలని, ప్రతి ఇంటిలో టీ కప్పులు, షూలు, సీసాలు, టైర్లు వస్తువులు, వంటివాటిని తొలగించి దోమలు వృద్ది కాకుండా చూడాలని సూచించింది.
పాత సామాన్ల షాప్, టైర్ పంక్చర్ షాప్‌లు, వెక్టర్ సోర్స్‌ల షాప్ లను తనిఖీ చేసి, నీరు నిల్వ ఉంచకుండా సూచనలు జారి చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలపై కప్పులు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, హాస్టళ్లు, పీహెచ్‌సీలు, బస్టాండ్, ముఖ్యంగా మైదానాలు శుభ్రం చేయాలని ఆదేశించింది.
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలో నందు ఉన్న శిథిలమైన భవనాలు/గోడలు తొలగించాలని, రోడ్డు ప్రక్కన కుళ్ళి పోతున్న చెట్లు, వాటి కొమ్మలు తొలగించాలని సూచించింది.
స్థలాలను గుర్తించి, మొక్కలను నాటాలి.ప్రతి గ్రామపంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలో స్థలాలను గుర్తించి, మొక్కలను నాటి వన మహోత్సవం కార్యక్రమము నిర్వహించాలని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారం, వన్య ప్రాణులు తినే చెట్లు, గిరిజనులు విక్రయించుకునే అటవీ ఉత్పత్తుల చెట్లను పెంచాలని సూచించింది.
అవెన్యూ ప్లాంటేషన్‌కు సంబందించిన స్థలాలు గుర్తించాలని, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలు నందు కిచెన్ గార్డెన్, ఇతర పండ్ల చెట్లు పెంచాలని, ప్రతి ఇంటికి కనీసం 6 మొక్కలను పంపిణీ చేయాలని, మునగ, కరివేపాకు, వేప, మామిడి, ఉసిరి, జామున్, చింత, దానిమ్మ మొదలైన కుటుంబాలకు ఉపయోగపడే పండ్ల, ఇతర మొక్కలను పంపిణీ చేయాలని ఆదేశించింది.
గ్రామపంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలో నందు ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనము, పార్క్ లను శుభ్రం చేయించాలని తెలిపింది.
గ్రామపంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలో ఆస్తులు (స్థలములు, భవనములు .మొదలైనవి) గుర్తించి, వాటిని జియో టాగింగ్ చేయాలని ఆదేశించింది.
జిల్లాలోని అన్ని వార్డు, గ్రామ పంచాయతీ టీమ్ సభ్యులు రోజూ ఆయా కార్యక్రములు పర్యవేక్షిస్తూ.
వాటిఫై కలెక్టర్ కు నివేదిక అందించాలి.గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలలో పరిశుభ్రత, పచ్చదనం కొనసాగించడానికి, నిరంతర ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహించాలని, ప్రతి నెలా మూడో శనివారం “స్వచ్ఛదనం-పచ్చదనం” రోజుగా నిర్వహించాలని ఆదేశించింది.
మునిసిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈఓ, డీఆర్డీఓ, డీపీఓ, డీఎల్పీఓ, క్షేత్ర స్థాయిలో పర్యటించి, కార్యక్రమాల అమలు పై తమ నివేదికలు రోజు వారిగా కలెక్టర్ కు సమర్పించాలని సూచించింది.
“స్వచ్ఛదనం-పచ్చదనం”విజయవంతం చేయాలి సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్వచ్ఛదనం.
పచ్చదనం కార్యక్రమంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి.
షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలి.గ్రామాలు, పట్టణాలు స్వచ్చంగా.
పచ్చగా ఉండేలా కృషి చేయాలి.
పాముకు ముద్దులు పెట్టుకుంటూ డాన్సర్ హల్చల్.. వీడియో వైరల్