హాస్టల్ విద్యార్ధులనీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూరిబా గాంధీ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు అడుగుతే కళ్ళలో కారం కొట్టడం చాలా సిగ్గుచేటు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.

ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజున కస్తూరి గురుకుల విద్యార్థులు రోడ్డెక్కి వారి ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపను పోలేదని, చదువుకోవాల్సిన విద్యార్థులు వారి సమస్యల పైన రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని.

గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉందని విద్యార్థుల ఆవేదనలు మానవత్వంతో అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఉడకని అన్నం పెడుతున్నారని ఉపాధ్యాయులకు చెబితే వారు పట్టించుకోకపోగా వారి కళ్ళలో కారం కొట్టడం కాకుండా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం చాలా దారుణమని అలా చేసిన ఉపాధ్యాయుల ఉద్యోగాలను తొలగించాలని, విద్యార్థుల గురించి పట్టించుకోని అధికారుల పైన చర్యలు తీసుకోవాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న విద్యార్థుల పైన గాని విద్య వ్యవస్థ పైన గాని పట్టించుకున్న పాపన పోలేదని గురుకులాలు అద్వాన పరిస్థితుల గురించి ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదని అయ్యా ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సరియైన విద్య అందేలా చూడాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిటీలను వేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.

లేనిపక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఆఫీసు ముట్టడి చేస్తామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, వావిలాల సాయి, శ్రీనివాస్, కరుణాకర్,అరవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మహేష్ బాబు నంబర్ వన్.. నాని నంబర్2.. ఈ హీరోలకు సొంతమైన రికార్డ్ ఇదే!