కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేని రాష్ట్రప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ లో సోమవారం మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలను ఖండించిన బీజేపీ జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి విచ్చేసిన క్రమంలో భారతీయ జనతా పార్టీపై, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాల నాయకులను అరెస్టు చేయకుండా నీ సొంత నియోజకవర్గంలో పర్యటించే ధైర్యం ఉందా అని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ డిమాండ్ చేశారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు తో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఓర్వలేక కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.

Dolly Bonuses And Promotions: A Practical Breakdown For Canadian Players