సీబీఐ విచారణపై మండిపడుతున్న ఆ రాష్ట్ర సీఎం..!!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.

జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీజేపీ ప్రభావం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా దాడులు జరిగాయి.

ఈ క్రమంలో ఈ దాడులు కావాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేయిస్తోంది అంటూ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిరసనలు ఎక్కడికక్కడ చేపట్టారు.

ఈ క్రమంలో ఈ గొడవ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హైకోర్టుకు చేరుకోవడంతో తాజాగ .

జరిగిన గొడవ లపై న్యాయస్థానం సిబిఐ విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో సీఎం మమతా బెనర్జీ మండిపడుతున్నారు.

సిబిఐ విచారణ నిలిపివేయాలని మమతాబెనర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ విషయంలో ముందు నుండి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూన్నారు.

  సీబీఐ దర్యాప్తు సంస్థ కూడా కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అని దిది ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ఇదే క్రమంలో నారద స్టింగ్ ఆపరేషన్ కేసు కూడా వేగవంతం చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.

బెంగాల్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఫరీదా హకిం, శుభ్రత ముఖర్జీ సహా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.

మదన్ మిత్ర, మాజీ మేయర్ చార్జీలపై చార్జిషీట్ నమోదు చేయడం జరిగింది.ఈ చార్జిషీట్ లో ఈడి పేర్కొన్న నేతలకు ప్రత్యేక సమన్లు జారీ చేయడం జరిగింది.

ఈ క్రమంలో సదరు వ్యక్తులు నవంబర్ 16వ తారీకు లోపు కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేయడం జరిగింది.

దీంతో జరుగుతున్న తాజా పరిణామాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ పార్టీ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తున్నట్లు మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నారు.

కమలహాసన్ ఇక మీదట హీరోనా..? విలనా..?