వావ్, సూర్యుని కంటే మిలియన్ల రెట్లు ప్రకాశవంతమైన స్టార్.. దాని ద్రవ్యరాశి ఎంతంటే..?
TeluguStop.com
హబుల్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా అత్యంత దూరంలో ఉన్న ఒక సింగిల్ స్టార్ ని గుర్తించింది.
నాసా శాస్త్రవేత్తలు దీనికి ఈరెండెల్ (Earendel) అనే నిక్ నేమ్ పెట్టారు.13.
8 బిలియన్ ఏళ్ల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్‌లో విశ్వం పుట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ స్టార్ విశ్వం పుట్టిన మొదటి బిలియన్ ఏళ్లలోనే ఉనికిలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ స్టార్ చాలా దూరంలో ఉంది.ఎంత దూరం అంటే, దాని కాంతి భూమిని చేరుకోవడానికి 12.
9 బిలియన్ సంవత్సరాలు పట్టింది." అని హబుల్ అధికారిక పేజీ పేర్కొంది.
ఈరెండెల్ ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే కనీసం 50 రెట్లు ఉంటుందట.అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఇది సూర్యుడి కంటే మిలియన్ల రెట్లు ప్రకాశవంతంగా ఉంటుందని పరిశోధనా బృందం చెబుతోంది.
అంటే డైరెక్ట్ గా దాన్ని చూస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉంది.బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో బ్రియాన్ వెల్చ్ నేతృత్వంలో, పరిశోధనా బృందం గెలాక్సీ క్లస్టర్‌ను సహజమైన భూతద్దంగా ఉపయోగించింది.
గెలాక్సీ క్లస్టర్ దాని వెనుక ఉన్న సుదూర వస్తువుల నుంచి వచ్చే కాంతిని వక్రీకరిస్తూ.
సహజమైన భూతద్దాన్ని సృష్టిస్తుంది.అయితే పరిశోధకులు టెలిస్కోపు చిత్రాలు, స్పెక్ట్రా గమనించి ఈరెండెల్ ఒక స్టార్ అనే నిర్ణయానికి వచ్చారు.
అలాగే దాని వయసు, వేడి, వ్యాసార్థం అంచనా వేయగలిగారు.
భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు పై కొత్త సవాళ్లు?