త్రివిక్రమ్ ని ‘నోరు మూసుకో’ అంటూ అందరూ చూస్తుండగా బిగ్గరగా అర్చిన స్టార్ హీరోయిన్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 5 స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కచ్చితంగా ఉంటుంది.

ఒక మామూలు రచయితగా కెరీర్ ని ప్రారంభించిన ఈయన అప్పట్లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించాడు.

స్వయంవరం , చెప్పవే చిరుగాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి ఇలాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాలకు రచయితగా వ్యవహరించింది త్రివిక్రమ్ శ్రీనివాసే.

ఆ తర్వాత నువ్వే నువ్వే అనే సినిమాతో తొలిసారి డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అతడు,జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అ.ఆ!, అరవింద సమేత మరియు అలా వైకుంఠపురం లో వంటి సూపర్ హిట్ సినిమాలను తీసాడు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'గుంటూరు కారం'( Guntur Karam ) చిత్రం చేస్తున్నాడు.

వచ్చే ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / ప్రతిభ పట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ని వేలెత్తి చూపలేము.

అందులో ఆయన ఎవరెస్ట్ లాంటి వాడు, కానీ వ్యక్తిగతంగా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నడిపాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది.

సమంత, పూజా హెగ్డే , సంయుక్త మీనన్ తదితరులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అఫైర్స్ నడిపాడట.

ఇక పూనమ్ కౌర్( Poonam Kaur ) అనే హీరోయిన్ అయితే తనని త్రివిక్రమ్ వాడుకొని సినిమాల్లో అవకాశం ఇవ్వలేదంటూ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే త్రివిక్రమ్ గురించి సోషల్ మీడియా లో చాలా కథనాలే ఉన్నాయి.

కానీ ఒక టాప్ స్టార్ హీరోయిన్ తో త్రివిక్రమ్ ఇలా ఫన్నీ గా, సరదాగా మాట్లాడడం, ఆమె ట్రిగ్గర్ అవ్వడం , అందరూ చూస్తుండగానే నోరు మూసుకో అని బిగ్గరగా అరవడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందట.

"""/" / షాట్ అయిపోయిన తర్వాత బ్రేక్ సమయం లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుతున్న సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం పై సెటైర్లు వేస్తూ , కామెడీ చేసాడట.

దీనికి ఫైర్ అయిపోయిన ఆ స్టార్ హీరోయిన్ 'నువ్వు డబుల్ మీనింగ్ తో మాట్లాడితే అర్థం చేసుకోలేనంత పిచ్చిదానిని అనుకున్నావా?, మర్యాదగా మాట్లాడు, నీ వెక్కిలి వేషాలు వేరే ఎక్కడైనా వేసుకో, నా ముందు వేస్తె చెంప పగులుద్ది, నోరు మూసుకొని ఉండు' అని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిందట.

అప్పటి నుండి త్రివిక్రమ్ కి ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య మాటలే లేవట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి16, గురువారం 2025