తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం

తెలంగాణలో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సినియారిటీ జాబితాను ఇవాళ ఆన్ లైన్ లో ప్రకటించనున్నారు.

రేపటి నుంచి ఈనెల 30 వరకు బదిలీల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అప్లికేషన్ల హార్డ్ కాపీలను ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు అందజేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు దరఖాస్తులకు ఆమోదం తెలపనున్నారు.అనంతరం ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్ సైట్లలో సీనియారిటీ జాబితాను ప్రకటించనున్నారు.

ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు అభ్యంతరాల స్వీకరణ, 11, 12వ తేదీల్లో తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు.

అనంతరం ఫిబ్రవరి 14వ తేదీన ఆర్జేడీలు, ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు.

కాగా ప్రస్తుత పాఠశాలలో రెండేళ్లు పని చేసిన వారే బదిలీలకు అర్హులని వెల్లడించారు.

ఈ క్రమంలో ఐదేళ్లు పూర్తి అయిన ప్రధానోపాధ్యాయులు, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

పులివెందులలో సీఎం జగన్ నామినేషన్..!