వైసీపీ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం .. చేరికలకు రంగం సిద్ధం
TeluguStop.com
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ( Ycp )ఘోరంగా ఓటమి చెందడం, 175 స్థానాలకు గాను 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు.
దీంతో పాటు టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేసుకోవడం, గతంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీస్తూ కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలతో వైసిపి కేడర్ భయాందోళనతో ఉంది.
చాలామంది నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోగా, మరికొంతమంది పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
ఈ పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయనే అంచనాలో కాంగ్రెస్( Congress ) ఉంది.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.2014 ఎన్నికల దగ్గర నుంచి కాంగ్రెస్ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది .
ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను( YS Sharmila ) ఆ పార్టీ అధిష్టానం నియమించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం వైసీపీలో ఇబ్బందికర పరిణామాలు ఉండడం, పార్టీ మారే ఆలోచనతో చాలామంది నేతలు ఉండడంతో, దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది .
దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్తి నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తుంది.
టిడిపి , బిజెపిలలో చేరేందుకు అవకాశం లేని వారంతా కాంగ్రెస్ వైపే చూస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
వైసీపీలోని చాలామంది నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )కి సన్నిహితులు కావడం, వైసీపీలో వారికి సరైన ప్రాధాన్యం దక్కకపోవడం ఇప్పుడు పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
రాజశేఖర్ రెడ్డి సన్నిహితులుగా ఉన్న వైసిపి నేతలతో మంతనాలు చేస్తూ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారట.
"""/" /
ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగుండదని , ఈలోగా వైసిపి పూర్తిగా బలహీన అవుతుందని టిడిపి , జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మారుతుంది అనే అంచనాలో షర్మిల ఉన్నారట .
దీనికి తోడు తెలంగాణ, కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండడం, తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు .
ఈనెల 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి సభలో అనేకమంది కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వైఎస్సార్ వారసురాలు షర్మిల సీఎం అవుతారని వైఎస్ఆర్ జయంతి సభలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరిగితే తాను స్వయంగా ప్రతి గ్రామం తిరుగుతానని , ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని సామెతను నిరూపితం చేస్తానని రేవంత్ వ్యాఖ్యానించారు.
"""/" /
ఒకపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) , కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు ఏపీలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటివి తనకు బాగా కలిసి వస్తాయని షర్మిల అంచనా వేస్తున్నారు.
వైసిపిలో కీలకంగా పనిచేసన ధర్మాన కృష్ణ దాస్ , ధర్మాన ప్రసాదరావులకు కాంగ్రెస్ అగ్ర నేతలు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వీరే కాకుండా చాలామంది వైసిపి మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం వైసిపిలో ఆందోళన పెంచుతుండగా , కాంగ్రెస్ కేడర్ లో ఈ పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
కీళ్ల నొప్పుల నివారిణి కరక్కాయ.. ఎలా వాడాలో తెలుసా?