మున్సిప‌ల్ ఆఫీసుకే క‌రెంట్ క‌ట్ చేసిన సిబ్బంది.. విష‌యం తెలిస్తే షాక్‌..

మ‌న ఇంటికి క‌రెంట్ బిల్లు క‌ట్ట‌క‌పోతే ఏం చేస్తారు.ఏముంది మ‌హా అయితే రెండు మూడు సార్లు అడుగుతారు ఫైన్ వేస్తారు.

లేదంటే పెండింగ్ ఎక్కువ‌గా ంఉటే మాత్రం అప్పుడు యాక్ష‌న్ తీసుకుంటారు క‌దా.మ‌రి గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులు కూడా క‌రెంట్ బిల్లులు క‌ట్ట‌కుండా చాలా వ‌ర‌కు ఇప్పుడు మ‌న రాష్ట్రంలో బకాయిలు పేరుకుపోయట‌.

ఇక ఇలా ప్ర‌భుత్వ ఆఫీసులు పెండింగ్ బిల్లులు పేరుకుపోవ‌డంతో విద్యుత్ శాఖ అధికారుల‌కు పెద‌ద్ త‌ల‌నొప్పిగా మారింద‌ని తెలుస్తోంది.

ఎందుకుంటే వారి మీద ఎలాంటి యాక్ష‌న్ తీసుకోవాల‌న్నా కూడా పెద్ద స‌మ‌స్యే క‌దా.

ఇక ఇలాంటి మొండి బ‌కాయిల‌ను ప్ర‌జ‌ల ద‌గ్గ‌రి నుంచి అయితే ఏదో విధంగా వ‌సూలు చేయొచ్చు గానీ నెలల తరబడి బిల్లుల‌ను క‌ట్ట‌కుండా ఉండే ప్ర‌భుత్వ ఆఫీసుల విష‌యంలో వసూలు చేసేందుకు విద్యుత్ అధికారుల‌కు పెద్ద తల నొప్పిగా మారింది.

మ‌రీ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో లక్షల్లో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఇక లాభం లేదనుకుని ట్రాన్స్ కో ఆఫీస‌ర్లు ఎలాగైనా స‌రే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల‌ని డిసైడ్ అయిపోయార‌ని తెలుస్తోంది.

ఇక ఇందులో భాగంగా యాక్ష‌న్ షురూ చేశారు. """/"/ దాదాపుగా రూ.

6 కోట్ల వ‌ర‌కు మొండి బకాయిల‌ను చెల్లించకుండా ఉన్నందుకు ఏకంగా అనంత‌పురం జిల్లాలోని కళ్యాణ దుర్గం మున్సిపల్ ఆఫీసుకు క‌రెంట్‌ను ఆపేశారు.

అయితే ఈ మున్స‌పిప‌ల్ ఆఫీసు ఒక్క నెలకు దాదాపుగా రూ.50 లక్షలు దాకా బకాయిలు చెల్లించేది ఉంద‌ని స‌మాచారం.

ఈ కార‌ణంగానే 6 రోజులుగా క‌రెంట్ క‌ట్ చేశారంట‌.ఇక క‌రెంట్ లేక‌పోవ‌డంతో ఆఫీసులో అన్ని ప‌నుల‌కు అటు ఆఫీస‌ర్లు, ఇటు జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇప్ప‌టికైనా ఆ పెండింగ్ బిల్లుల‌ను చెల్లించి క‌రెంట్ స‌ర‌ఫ‌రా అయ్యే విధంగా చూడాలంటూ కోరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై1, సోమవారం 2024