మహానంది ఆలయంలో ఉన్న కోనేరు ప్రాముఖ్యత ఇదే..?
TeluguStop.com
ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహానంది కూడా ఒకటి.ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే వాటిలో మహానంది కూడా ఒకటి.
కర్నూలు జిల్లాలో వెలసిన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలకు పేరుగాంచింది.ఇందులో భాగంగానే ఆలయంలో ఉన్న కోనేరు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఈ కోనేరులో ఉన్న నీరు ఒక విశేషంగా చెప్పవచ్చు.అయితే ఈ ఆలయ కోనేరు ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
"""/" /
ఈ ఆలయంలో ఉన్న ప్రధాన లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి.
ఈ నీటి ఊటలు ద్వారా నీరు ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖశిల నుంచి దారలా ప్రవహిస్తుంటాయి.
ఎల్లవేళలా లింగము క్రింద నుంచి నీరు ఊరుతూనే ఉంటాయి.అయితే అవి ఎక్కడి నుంచి ఊరుతున్నాయనే విషయం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.
అక్కడి నుంచి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది.
ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది.
"""/" /
ఈ ఆలయంలో ఉన్న కోనేరులో ఎల్లప్పుడూ నీరు ఒకే స్థాయిలో (1.
7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది.ఈ కోనేరులో ఉన్న నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే ఒక చిన్న గుండు పిన్ను పడిన కూడా మన కంటికి కనిపించే అంత స్వచ్ఛంగా ఉంటాయి.
కేవలం ఈ ఆలయంలో ఉన్న కోనేరులో మాత్రమే కాకుండా ఆలయ పరిసరాల్లో ఉన్న బావులలో కూడా ఇలాంటి స్వచ్ఛమైన నీరే ఉంటుంది.
మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి ఊరుతున్న నీటి వల్ల మహానంది పరిసర ప్రాంతాలలో దాదాపు మూడు వేల ఎకరాలలో పంటను పండిస్తున్నారు.
అంతే కాకుండా ఈ ఆలయంలో ఉన్న కోనేరులో బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కోనేరు రూపంలో ఉన్నాయి.
ఈ కోనేరులో ఉన్న నీటిని భక్తులు మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు.
ఇలాంటి పాత్రల్లో అద్భుతంగా నటించడం ఎన్టీఆర్ కే సాధ్యం.. ఏం జరిగిందంటే?