బీసీసీఐ కు షాక్ ఇచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్.. ఐపీఎల్ కు దక్షిణాఫ్రికా ప్లేయర్స్ దూరం..!

ఈనెల 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇంతలో బీసీసీఐకు షాక్ ఇచ్చింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్.

ఐపీఎల్ లో ప్రారంభ మ్యాచులకు తొలి వారం రోజుల వరకు తమ ప్లేయర్లను పంపించలేమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్.

సీఎస్ఏ, బీసీసీఐకు తెలియజేసింది.మార్చి 31 నుండి నెదర్లాండ్- దక్షిణాఫ్రికా మధ్య రెండు వన్డేల సిరీస్ మొదలుకానుంది.

అయితే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కానీ ఈ నిర్ణయం భారత్ లోని ఆరు ఫ్రాంచైజీలకు షాకింగ్ ఇచ్చింది. """/" / నెదర్లాండ్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండు వన్డేల సిరీస్ దక్షిణాఫ్రికాకు ఎంతో కీలకం.

భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలవడం దక్షిణాఫ్రికాకు ఎంతో అవసరం.

కాబట్టి ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారం తమ ప్లేయర్స్ అందుబాటులో ఉండరని తెలియజేయడంతో, బీసీసీఐ కూడా సమ్మతించినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

"""/" / ముంబై ఇండియన్స్ ( ట్రిస్టన్ స్టబ్స్, డేవాల్డ్ బ్రేవిస్), ఢిల్లీ క్యాపిటల్స్ (నోర్త్జ్, లుంగి ఎంగిడి), గుజరాత్ టైటాన్స్ (డేవిడ్ మిల్లర్), లక్నో సూపర్ జెయింట్స్ (క్వింటన్ డికాక్), పంజాబ్ కింగ్స్ (రబాడా), సన్ రైజర్స్ హైదరాబాద్ (మార్క్ రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్) లు ఐపీఎల్ లో జరిగే తొలి రెండు మ్యాచ్లకు రాలేకపోవడంతో ప్రస్తుతం షాక్ లో ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్ రమ్ లేకపోవడంతో జరిగే తొలి రెండు మ్యాచ్లకు తాత్కాలిక కెప్టెన్ గా ఎవరు సారథ్యం వహిస్తారో ఆసక్తికరంగా మారింది.

క్రికెట్ అభిమానులు అందరూ ఐపీఎల్ మొదలవుతుందనే సంబరాల్లో ఉంటే, అభిమానులతో సహా ఫ్రాంచేజీలకు కూడా దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!