కనిపెంచిన తల్లికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. ఏమైందంటే

చాలా మంది తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలని మంచి ఉద్యోగాల కోసం అన్వేషిస్తుంటారు.

గవర్నమెంట్ ఉద్యోగాలు అయినా, ప్రయివేటు ఉద్యోగాలు అయినా, చివరికి కూలి పని అయినా తల్లిదండ్రులు తమ జీవితాంతం పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.

అయితే తనను కని, పెంచి, విద్యా బుద్ధులు నేర్పించి, ప్రయోజకుడిని చేసిన తల్లికి ఓ కొడుకు ఊహించని గిఫ్ట్ అందించాడు.

అజ్మీర్‌లో ఒక కొడుకు తన తల్లి పదవీ విరమణను గుర్తుండిపోయేలా చేశాడు.తల్లి స్కూల్ నుంచి రిటైర్ కాగానే ఇంజనీర్ కొడుకు హెలికాప్టర్ లో ఇంటికి తీసుకొచ్చాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.సుశీలా చౌహాన్ (60) అనే మహిళ అజ్మీర్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల కేసర్‌పురా, పిసంగన్‌లో ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో టీచర్‌గా శనివారం పదవీ విరమణ పొందారు.

ఆయన కుమారుడు యోగేష్ చౌహాన్ అమెరికాలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

తల్లికి పదవీ విరమణ రోజును అత్యంత మధురంగా మలిచాడు ఆమె కుమారుడు యోగేష్ చౌహాన్.

తన తల్లి పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు అమెరికా నుంచి తన ఇంటికి వచ్చాడు.

ఇక్కడికి చేరుకోగానే యోగేష్ చౌహాన్ హెలికాప్టర్ కోసం అధికారుల అనుమతి తీసుకున్నారు.స్కూల్ నుంచి రిటైర్ అయిన తర్వాత యోగేష్ తల్లి ఇంటికి వెళ్లగా, స్కూల్ ప్లేగ్రౌండ్‌లో హెలికాప్టర్ పార్క్ చేసి ఉండడం ఆమెకు కనిపించింది.

తల్లి సుశీలతో పాటు, తండ్రి రమేష్‌చంద్, సోదరి కవిత, దీపికా చౌహాన్‌తో కలిసి యోగేష్ హెలికాప్టర్‌లో ఎక్కారు.

వారు పిసంగన్ నుండి ఎగురుతూ అజ్మీర్‌లోని తోపాడ స్కూల్ గ్రౌండ్‌లో దిగారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరిపై పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు.

రెండేళ్ల క్రితం తన ఇంట్లో కూతురు పుట్టిందని యోగేష్ చౌహాన్ చెప్పాడు.అప్పుడు అతని తల్లి తన మనవరాలిని కలవలేకపోయిందన్నారు.

తన మనవరాలు ఇండియా వస్తే హెలికాప్టర్‌లో తీసుకువస్తానని ఆమె తరచూ చెబుతుండేదని గుర్తు చేసుకున్నారు.

అప్పుడు తన తల్లిని హెలికాప్టర్‌లో తీసుకెళ్తానని అనుకున్నానని యోగేష్ చెప్పాడు.పదవీ విరమణ రోజున అలా హెలికాప్టర్‌లో తీసుకెళ్లినట్లు వివరించారు.

హైదరాబాద్ లో మరో థియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బన్నీ… ప్రత్యేకతలు ఇవే!