విద్యార్ధిని జైలుకు పంపిన స్మార్ట్‌ ఫోన్‌.. !

ఒకప్పుడు పిల్ల చేతికి సెల్ ఇవ్వాలంటే ఆలోచించే వారు కానీ కరోనా వల్ల మొదలైన ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని బుడ్దపిల్లల దగ్గరి నుండి సెల్‌కు అలవాటు పడిన వారు ఎందరో ఉన్నారు.

ఇదే కాకుండా ఇంటర్ నెట్ కూడా ఉండటంతో చదువుల మాట పక్కన పెడితే ఎన్నో అనర్ధాలు మాత్రం చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ చదువుల కోసం తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్‌ ఫోన్‌ను చెడు పనికి ఉపయోగించి జైలుపాలు అయ్యాడు ఓ యువకుడు.

ఆ వివరాలు చూస్తే.మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ముడుచింతలపల్లి మండలం, లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి (16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

కాగా కరోనా నేపధ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో భాగంగా కాలేజీ యజమాన్యం వాట్సాప్‌ గ్రూప్‌లో క్రియేట్ చేసింది.

అలా ఆ వాట్సప్ లో ఉన్న ఓ బాలిక ప్రొఫైల్‌ ఫోటో చూసి ఆకర్షితుడైన ఈ విద్యార్ధి ఆమెను వేధించడం మొదలు పెట్టాడట.

ఈ క్రమంలో విద్యార్ధిని నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, తన నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి ఘటనలు జరిగాయట.

దీంతో ఆమె పై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి తన దగ్గర ఉన్న బాలిక ఫోటోను ఫేస్‌యాప్‌ ఎడిటర్‌ సాయంతో నగ్న చిత్రాలకు జోడించి ఆమెకు పంపించాడట.

అనంతరం న్యూడ్‌ వీడియో కాల్‌ చేయాలంటూ, లేకుంటే మార్ఫింగ్‌ చేసిన ఫోటోలు ఇతర గ్రూప్‌లకు పంపిస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండటంతో బాధితురాలు కుటుంబ సభ్యుల సాయంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా ఈ భాగోతం బయటకు వచ్చింది.

కాగా పోలీసులు అతనిపై సెక్షన్‌ 354డి, 509, 201 ఐపీసీ, సెక్షన్‌ 12 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌, 67ఏ ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ ఆఫ్‌ సైబర్‌ క్రైమ్స్‌ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారట.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !