ఏపీలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితి..: పురంధేశ్వరి

విశాఖలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది.ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ పదాధికారులు అంకిత భావంతో పని చేయాలని తెలిపారు.

అప్పుల బాధతో రాష్ట్ర ప్రభుత్వం కుంగిపోతోందన్న పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులమయంగా తయారు చేసిందని ఆరోపించారు.

ఏపీలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆమె విమర్శించారు.గ్రామ పంచాయతీ నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు.

కాంట్రాక్టర్లకు బకాయిలు సైతం చెల్లించడం లేదన్న ఆమె వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.పార్టీ బలోపేతంతో పాటు బీజేపీ సర్కార్ వచ్చే విధంగా పార్టీలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పురంధేశ్వరి సూచించారు.

భారతీయుడు 2 ప్లాప్ తో వణికిపోతున్న దిల్ రాజు…కారణం ఏంటంటే..?