పాలకుల పాపం…కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం… ప్రజలకు శాపం…?

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పట్టణ కేంద్రంలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వెడల్పు పనులను గత పాలకులు ప్రారంభించారు.

కాంట్రాక్టర్ కు పనులు అప్పగించిన ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు విస్మరించారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నేటికీ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో రామన్నపేట కెనరా బ్యాంక్ ప్రాంతంలో చినుకు పడితే చాలు రోడ్డు చెరువును తలపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చిన్న వర్షం వచ్చినా సుమారు మూడు ఫీట్ల లోతు నీరు నీలువ ఉండడంతో వరద ధాటికి గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనాలు గుంతలో పడి ప్రమాదాన్ని గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు నిద్ర మత్తును వీడి మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఒక్క బొట్టు కూడా కింద పడకుండా నూనెని ఇలా బాటిల్లో నింపండి!