శివపార్వతుల దేవాలయం లోపల వణికించే చలి.. బయట మాత్రం మండే ఎండ.. సైన్స్ కు కూడా అర్థం కాని మిస్టరీ..?

మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.కొండ కోనలలో, నది ఒడ్డున ఇలా ఎన్నో ప్రదేశాలలో దేవాలయాలు ఉన్నాయి.

కొన్ని స్వయంభుగా వెలసిన దేవాలయాలు, అయితే మరికొన్ని మానవ నిర్మితాలు అని పండితులు చెబుతున్నారు.

మన భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.

అయితే ఎక్కువగా ఆదిదంపతులైన శివపార్వతుల దేవాలయాలు కొండలలో ఉంటాయి.శివాలయాలు( Shiva Temple ) పర్వతాల మీద ఉండడం వల్ల చాలా ప్రదేశాలు విపరీతంగా చలిగా ఉంటాయి.

అయితే మన దేశంలోనే అంతా రహస్యమైన దేవాలయం ఉంది.అయితే అక్కడి పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది.

ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు.మనదేశంలో మహా శివుడు, శక్తి స్వరూపిణి పార్వతి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

"""/" / శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తారు.

తమ శక్తికి మించిన ప్రయాణం చేసి భక్తులని, భగవంతుని దర్శనం చేసుకుంటారు.దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణం కథలు మనం వింటూనే ఉంటాము.

అలాంటి కొన్ని దేవాలయాలలోని రహస్యాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.కొన్ని రహస్యాలను సైన్స్ కూడా చేదించలేదు.

అలాంటి మిస్టరీ దేవాలయాలలో ఒకటి కొండమీద ఉన్న శివపార్వతుల దేవాలయం.ఈ దేవాలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది.

మరికొన్ని క్షణాల్లో విరుద్ధమైన చలి పెరుగుతున్న అనుభూతిని చెందుతారు.మన భారతదేశంలోని ఈ అద్భుత ఆలయం యొక్క రహస్యాన్ని ఎవరు కూడా పరిష్కరించలేదు.

"""/" / ఒరిస్సా రాష్ట్రం( Odisha )లో ఓ అద్భుతమైన శివాలయం ఉంది.

ఈ మిస్టరీ దేవాలయం టిట్లాగఢ్‌లో ఉంది.దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా కూడా ఒకటి.

ఈ దేవాలయం కుంహదా పర్వతం మీద ఉంది.ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది.

అయితే ఈ దేవాలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది.బయట ఎంతో వేడిగా ఉన్న గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది.

దేవాలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది.

ఒక్కొక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

ఇది దైవం మహిమ లేక, ప్రకృతి అద్భుతమా అని ఎవరికి అర్థం కావడం లేదు.