శాస్త్రవేత్తలకు అంతు చిక్కని శివాలయం.. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే..?

సాధారణంగా చెప్పాలంటే మన దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు,పురాతన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.శ్రీకాళహస్తి( Srikalahasti ) నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో భైరవకోన ఉంది.

ఈ ప్రాంతంలో చాలా మహిమగల శివలింగం( Shiva Temple ) ఉంది.చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండమీద ఉండడం వల్ల ఆ కొండల్లో నుంచి వచ్చే నీరు నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తూనే ఉంటుంది.

"""/" / ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రంలో ప్రకాశం జిల్లాలో వెలిసిన భైరవకోన( Bhairavakona ) శైవ క్షేత్రం ఒకటి.

సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపం లో భైరవకోనలో వెలసిన ఈ శైవ క్షేత్రంలో ఎన్నో వింతలు, విశేషాలు భక్తులను తన్మయానికి గురిచేస్తూ ఉంటాయి.

ఇక్కడ ఉండే వాటర్ ఫాల్స్ చూపు పక్కకు తిప్పుకొనివ్వదు.సజీవకలతో ఉట్టిపడే విగ్రహాలు జీవకోటిని మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి.

భైరవకోనలో క్రీస్తు శకం తొమ్మిదవ దశాబ్దంలో ప్రసిద్ధ శివాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు.

వారు క్షేత్రంలో ఒకే కొండను తొలిచి 8 శివాలయాలను ప్రతిష్టించారు.ఇక్కడ 108 శివలింగాలు సైతం భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది.

అంతేకాకుండా కొండ నుంచి జాలు వారుతున్న జలపాతం మరో ప్రత్యేకత.ఈ జలపాతం లో భక్తులు స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

ఇలా ఎన్నో వింతలు, విశేషాలు ఉన్న భైరవకోన పుణ్యక్షేత్రంలో మరో విశేషమైన ప్రత్యేకత ఉంది.

"""/" / భైరవకోనలో కొలువుదిరిన శివలింగాలు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లోని శివలింగాన్ని పోలి ఉండడంతో ఈ దేవాలయాలను దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భైరవకోన క్షేత్రానికి వస్తూ ఉంటారు.

ఇక్కడ శివలింగాలలో ప్రధానంగా జల లింగం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది.ఈ శివలింగం అడుగుభాగాన ఎన్నటికీ కాలాలతో సంబంధం లేకుండా ఇంకిపోని జలం ఉండడం ఇక్కడి విశిష్టత.

జల లింగం అడుగు బాగాన భక్తులు చేయితో నీటిని తీసుకొని తమపై చల్లుకుంటూ ఉంటారు.

దీనితో సర్వ పాపాలు దూరం అవుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.ఈ జల లింగం అడుగు భాగాన సుమారు 12 అడుగుల లోతులో నీరు ఉంటుందని పురావస్తు అధికారులు సైతం చెబుతున్నారు.

మరి ఈ నీరు ఎన్నటికీ ఇంకిపోవడం జరగలేదని, ఈ నీరు అమృతాన్ని పోలిన జలమని స్థానిక పూజారులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?