పండ్ల ఆకారమే అవయవాలను పోలి ఉంటుంది.. అటువంటి పండ్లు తింటే చాలు..
TeluguStop.com
మన శరీరం ఆరోగ్యంగా ఉండా లంటే ప్రతి రోజు పోషకాలతో నిండి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.కొన్ని పండ్లు మన శరీర అవయవాలను పోలి ఉంటాయి.
ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ పండ్ల గురించి మీకు తెలిసిపోతుంది.
మరి ఏ పండ్లను తింటే ఏ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లను తినడం వల్ల విటమిన్ ఎ లభిస్తుందని, కంటి సమస్యలు దూరమైపోతాయని, చూపు మెరుగుపడుతుందినీ దాదాపు చాలామందికి తెలుసు.
క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కన్నులకు ఎంతో మేలు చేస్తుంది.కళ్ళల్లో శుక్లాలు రాకుండా చేస్తుంది.
క్యారెట్ లను అడ్డంగా చక్రాల మాదిరిగా కోసి చూడండి.కన్నుల ఆకారాలు కనిపిస్తాయి.
కాబట్టి ఇవి కనులకు ఎంతో మేలు చేస్తాయి. """/"/
అంతే కాకుండా ఆవకాడోలు చూసేందుకు అచ్చం గర్భాశయాన్ని పోలి ఉంటాయి.
ఆవకాడోలను తినడం వల్ల మహిళలలో ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుంది.దీని వల్ల గర్భాశయం, యోని గోడలు దృఢంగా మారుతాయి.
చాలా రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.అంతే కాకుండా గర్భాశయ భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.
"""/"/
ఇంకా చెప్పాలంటే టమాటాలను నిలువుగా కోస్తే లోపలి భాగం అచ్చం మన గుండెలా కనిపిస్తుంది.
అందువల్ల టమోటాలు గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి.టమాటాల్లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది.
దీని వల్ల టమాటాలకు ఎరుపు రంగు వస్తుంది.టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి.టమాటాలు గుండె ఆరోగ్యానికి మంచిదని మరి ఎక్కువగా తీసుకోకూడదు.
ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఆహార పదార్థామైన తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
అయ్యబాబోయ్.. వేడి నీటిని ఇంత సులువుగా పొందవచ్చా? (వీడియో)