చేతులు జోడించి నమస్కరించడం లో ఆంతర్యం ఏమిటో తెలుసా?

ఎదుటి వారి పట్ల మన గౌరవాన్ని తెలపటం కోసం నమస్కారం చేస్తూ ఉంటాం.

నేను అన్న అహం విడిచి అవతలి వ్యక్తిని గౌరవించటమే నమస్కారం యొక్క ఉద్దేశం.

మన హిందూ ధర్మంలో చేతులు జోడించి నమస్కారం చేయటం అనేది ప్రధానమైన అంశం.

ఆ తర్వాత ఈ పద్దతిని బౌద్ధ, జైన మొదలైన మతాలు అనుసరించాయి.

నమస్కారం చేయటానికి రెండు చేతులను దగ్గరకు చేర్చినప్పుడు వేళ్ళ చివరన, అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి.

దాని వలన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు.ఇది ఒక కారణం అని చెప్పవచ్చు.

అంతేకాక మరొక అద్భుతమైన రహస్యం దాగి ఉంది.నమస్కారం చేయడం వలన హృదయ భాగం లో ఉండే అనాహత చక్రం తెరుచుకుంటుంది.

ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరి కొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతాం.

అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఒక అలౌకికమైన, ఆత్మానుసంధానమైన వారధి ని నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాము.

అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకూ మాటలతో పనిలేకుండా ఒకరి మనసును మరొకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుంది.

ఇదే హిందూ ధర్మం లోని నమస్కారం యొక్క ఆంతర్యం.

ఆ తప్పు కారణంగానే వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత వచ్చింది: అశ్వినీ దత్