ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్( National Family Health Mapping ) రెండో విడత సర్వే నిర్వహిస్తున్నట్లు సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిది ఎం సంతోష్ తెలిపారు.
వీర్నపల్లి మండలం( Veernapalli )లో 300 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అదేవిధంగా ఆశా వర్కర్ల హెల్పింగ్ తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా 300 కుటుంబాలను గురువారం వరకు సర్వే పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సర్వేలో సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిధులు నవీన్, క్రితీకా, ఎల్లారెడ్డిపేట కు చెందిన ఆశా వర్కర్లు స్రవంతి, లత పాల్గొన్నారు.
చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?