రెండో విడత గొర్రెల పంపిణీలో మాయాజాలం

యాదవుల ఆర్ధిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ( Distribution Of Sheep ) రెండవ విడత అధికార పార్టీ స్థానిక నేతల మాయాజాలంతో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో అభాసుపలవుతుంది.

గొర్రెల పంపిణీ జరిగిన రెండవ రోజే దళారీ వ్యవస్థ గా మారిన గులాబీ లీడర్లు లబ్ధిదారులకు మాయ మాటలు చెప్పి తెచ్చిన రెండో రోజే అమ్మేలా ప్రేరేపించి ప్రభుత్వ లక్ష్యానికి,స్థానిక ఎమ్మెల్యేకు మచ్చ తెచ్చేలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.

గొర్రెల అమ్మకంలో కీ రోలు పోషించిన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో ఎదురు చెప్పలేని లబ్దిదారులు దాదాపుగా 43 యూనిట్ల గొర్రెలు లబ్ధిదారులు అమ్ముకున్నారు.

20 గొర్రెలు ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్.అలాంటిది 43 యూనిట్లు పేద యాదవుల వద్ద దళారులు మోసం చేసి అమ్మేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి అమాయక యాదవులను మోసం చేసిగొర్రెలు కొనుగొలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మండలంలో గొర్రెల యూనిట్ల వివరాలు అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లిలో 34యూనిట్లు, అమీనాబాద్ లో 14 యూనిట్లను కలిపి మొత్తం 49 యూనుట్ల గొర్రెలను అధికారులు,నాయకులు పంపిణి చేశారు.

గొర్రెల అమ్మకంపై చర్యలు తీసుకుంటాం శ్రీనివాస్,జిల్లా పశు వైద్యాధికారి.అనంతగిరి మండలానికి 49 యూనిట్ల గొర్రెలు వచ్చాయి.

అందులో చనుపల్లి గ్రామానికి 34, అమీనాబాద్ గ్రామానికీ 14 యూనిట్ల చొప్పున గొర్రెలు పంపిణి చేశారు.

ఈ రెండు గ్రామాలలో కొంతమంది గొర్రెలు అమ్ముకున్నట్లు మా దృష్టికి వచ్చింది.గొర్రెలను అమ్మడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఇంకా ఎంత ట్రోల్ చేస్తారో చేసుకోండి … ప్రభాస్ హిట్స్ తోనే సమాధానం చెబుతాడు