Prime Minister Narendra Modi : జగిత్యాలలో నేడు ప్రధాని మోదీ పర్యటన .. షెడ్యూల్ ఈ విధంగా..

దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) సైతం వరుసగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

నిన్న ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ నేడు తెలంగాణలోని జగిత్యాలకు రానున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు.

ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్( Begumpet Airport ) నుంచి జగిత్యాలకు బయలుదేరనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభకు భారీగా ఏర్పాట్లు తెలంగాణ బిజెపి నాయకులు చేపట్టారు.

అలాగే జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిపాడ్ వద్దకు ప్రధాని చేరుకోనున్నారు.

హెలిప్యాడ్ వద్ద 20 మంది నాయకులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.ఉదయం 10.

45 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం ఆవరణలో జరగనున్న విజయసంకల్ప సభ ప్రాంగణానికి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు.

"""/" / సభ వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉండబోతున్నారు.

సభ వేదికపై 36 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.ప్రధాని సభకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రధాని పర్యటన, బహిరంగ సభ భద్రత కోసం మూడు జిల్లాల నుంచి 1600 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నారు.

ఈ సభకు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి లక్ష మంది జనాలకు తగ్గకుండా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.

జగిత్యాల,( Jagityala ) నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.అయితే కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు దగ్గర లో ఉండడంతో, ఈ నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలు ప్రధాని సభకు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాతో భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

"""/" / ప్రధాని జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణం లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కరీంనగర్ ,నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.

ఈ సభను సక్సెస్ చేసి తెలంగాణలో బిజెపికి తిరుగులేకుండా చేసుకుని, మెజారిటీ ఎంపీ స్థానాలను గెలవాలనే పట్టుదలతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?