బై పాస్ రహదారుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో బై పాస్ రహదారుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు.

మొదటగా రగుడు - వెంకటాపూర్ బై పాస్ మార్గములో రగుడు నుంచి వెంకటాపూర్ వైపుగా ఒక కిలో మీటర్ వరకూ వెంకటాపూర్ నుంచి రగుడు వైపు ఒక కిలో మీటర్ దూరం మొక్కలు నాటాలన్నారు.

వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయం అనిపంచాయితీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో డివైడర్, రహదారి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు .

క్షేత్ర పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ,జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, పంచాయితీ రాజ్ కార్యనిర్వాక ఇంజనీర్ సూర్య ప్రకాష్ , టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

స్కూటర్‌ను రెక్‌లెస్‌గా నడిపిన యువతి.. కింద పడ్డాక ఏం చేసిందో చూస్తే నవ్వాగదు..?