తెలంగాణలో దొరల పాలన పోవాలి..: రేవంత్ రెడ్డి
TeluguStop.com

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖానాపూర్ ప్రచారాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన పోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని తెలిపారు.


ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉండాలన్న రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
ధరణి పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుందని తెలిపారు.ధరణి పోర్టల్ ను తీసివేసి దానికంటే మంచి యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఆదివాసీలు, లంబాడీల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.
ధమాకా సీక్వెల్ రాబోతోందా… టైటిల్ కూడా లీక్ చేసిన డైరెక్టర్… ఏంటో తెలుసా?