‘సలార్’ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..సోషల్ మీడియా రూమర్స్ కి చెక్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన 'సలార్' చిత్రం ( Salaar Movie )పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

సెప్టెంబర్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది.

సాధారణంగా ఒక సినిమా వాయిదా పడితే డిమాండ్ తగ్గుతుంది.ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ గా బాగా తగ్గిపోతుంది.

కానీ సలార్ విషయం లో అది జరగలేదు.ఎప్పుడొచ్చినా రికార్డ్స్ బద్దలు అయిపోతాయి అనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది.

ఇక అభిమానులు ట్రైలర్ కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేద్దాం అని అనుకున్నారు కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.

"""/" / కానీ ఇప్పుడు ట్రైలర్ కట్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయిపోయిందట.

డిసెంబర్ 1 వ తేదీన ఈ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ట్రైలర్ తర్వాత 22 వ తారీఖు వరకు నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు అట మేకర్స్.

ప్రభాస్ కూడా మోకాళ్ళ సర్జరీ చేసుకొని రీసెంట్ గానే హైదరాబాద్ కి చేరుకున్నాడు.

ఆయన కూడా ఈ ప్రొమోషన్స్ లో డిసెంబర్ 1 వ తేదీ నుండి పాల్గొనబోతున్నాడు.

వాస్తవానికి 'సలార్' కంటెంట్ గురించి ఎవరికీ ఐడియా లేదు.టీజర్ లో కూడా కేవలం కొన్ని షాట్స్ ని మాత్రమే చూపించారు కానీ, అసలు సినిమా స్టోరీ ఏమిటి అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.

పోస్టర్స్ కూడా ఫ్యాన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అందుకే ఆడియన్స్ మూవీ కంటెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

"""/" / ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన హిందీ డిస్ట్రిబ్యూటర్ కొన్ని అనుకోని కారణాల వల్ల తప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి.

అభిమానులు ఈ వార్తని చూసి తెగ కంగారు పడిపోయారు.దీనివల్ల మళ్ళీ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి.

ఆ వార్తలను కందిస్తూ మూవీ టీం నేడు ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్న విషయాన్నీ లీక్ చేసారు.

త్వరలోనే దీనికి సంబంధించి సరికొత్త పోస్టర్ తో అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఈ చిత్రం లో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా, మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ ముఖ్య పాత్రని పోషించాడు.

పృథ్వి రాజ్ మలయాళం భాషకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసాడని టాక్.

జలమయమైన ముంబై రోడ్లు గుండా వెళ్లిన ఉబర్ డ్రైవర్‌.. ఆస్ట్రేలియన్ మహిళ ఫిదా..??