తెలంగాణాలో రాహుల్ పర్యటనలు ! అసలు కారణం ఇదేనా ...?

తెలంగాణాలో ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఎట్టి పరిస్థితుల్లో అయినా .

అధికారం దక్కించుకుని దేశవ్యాప్తంగా తమ పరపతిని కాపాడుకోవాలని చూస్తోంది.ఇక్కడ రాబోయే ఫలితాలు ఆ తరువాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ ఇంతగా కంగారు పడుతోంది.

అందుకే తెలంగాణ వ్యాప్తంగా సభలు.సమావేశాలతో హోరెత్తిస్తోంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సర్వాధికారాలు ఇవ్వడమే కాకుండా హెలికాఫ్టర్ కూడా సమకూర్చి ప్రచారానికి దింపింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మొన్న మేడ్చెల్ లో జరిగిన బహిరంగ సభలో సోనియా .

రాహుల్ పాల్గొన్నారు.ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగి తెలంగాణాలో విస్తృతంగా పర్యటనలు.

సభలు.సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపుతున్నాడు.

రాహుల్ ఇంత విస్తృత స్థాయిలో పర్యటించడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియాగాంధీ చేసిన ప్రసంగంతో రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారిపోయింది.

కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం కనిపించింది.అందుకే ఇప్పుడు రాహుల్ ని రంగంలో కి దింపి టీఆర్ఎస్ ఆటకట్టించడమే కాకుండా.

తెలంగాణాలో కాంగ్రెస్ పై సానుభూతి వచ్చేలా చేసేందుకు ఆ పార్టీ ప్లాన్ చేసుకుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అందుకే ముందుగా టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలను కాంగ్రెస్ టార్గెట్ చేసుకుంది.

మరీ ముఖ్యంగా.మంత్రులు, స్పీకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ప్రధానంగా రాహుల్ సభలు ఉండేలా స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చూస్తున్నారు.

అంతే కాదు రాహుల్ ప్రసంగించే సభలకు భారీ జనసమీకరణ చేస్తూ టీఆర్ఎస్ ను భయపెట్టేందుకు చూస్తున్నారు.

ఇక రాహుల్ ప్రసంగాలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీఆర్ఎస్ వైకిరిని విమర్శిస్తూ.

దూకుడుగా మాట్లాడం కాంగ్రెస్ కి కలిసొస్తుంది.

Jesus Christ : ఏసుక్రీస్తు శిలువలో పలికిన అతి ముఖ్యమైన మాటలు ఇవే..!