బిగ్‌బాస్‌గా నాగార్జున రావడానికి కారణం ఇదే

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా నాగార్జున ను ఈ సీజన్‌ హోస్ట్‌గా ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

అయితే యంగ్‌ హీరోలు చాలా మంది ఉండగా ఎందుకు నాగార్జునను ఎంపిక చేశారనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

నాగార్జునకు ముందు చేసిన ఎన్టీఆర్‌ మరియు నానిలు యంగ్‌ హీరోలు.వారి తరహాలోనే మరో యంగ్‌ హీరోను ఎంపిక చేస్తారని కొంత మంది భావించారు.

"""/"/ యంగ్‌ హీరోల్లో ఇద్దరు ముగ్గురు బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేసేందుకు ముందుకు వచ్చారు.

అయితే వారికున్న గుర్తింపు బిగ్‌బాస్‌కు ఎంత మేరకు ఉపయోగపడుతుందో అనే అనుమానం బిగ్‌బాస్‌ నిర్వాహకులకు వచ్చింది.

నాగార్జునకు ఇప్పటికి కూడా మహిళల్లో మంచి అభిమానులు ఉన్నారు.బిగ్‌బాస్‌ చాలా కామన్‌గా యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది.

మహిళలను టీవీ ముందు కూర్చోబెట్టాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారు.బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేయాలంటే మాటలు కాదు.

నాగార్జునకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి హోస్ట్‌గా చేసిన అనుభవం ఉంది.అందుకే నాగార్జునను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మూడవ సీజన్‌కు నాగ్‌ హోస్ట్‌ చేసి సక్సెస్‌ అయితే మరో రెండు మూడు సీజన్‌ల వరకు ఆయన్నే హోస్ట్‌గా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ ఎత్తున అంచనాలున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 వచ్చే రెండు వారాల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి