ఈ మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి కారణం.. జనాలే !

ప్రతి ఏడాది సినిమాలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి.కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి.

అలాంటి సినిమాల తాలూకు సన్నివేశాలు, సాంగ్స్, ఫైట్స్ .ఇలా ప్రతి అంశం కూడా మన మైండ్ లో అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి.

విచిత్రం ఏమిటంటే ఆ సినిమాలు విడుదల అయ్యే సమయానికి.అవి ఫ్లాప్స్ గా నిలవడమే.

ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ఇప్పటికీ కూడా అంతుచిక్కని ప్రశ్నే.ఒక విధంగా చెప్పాలంటే అలాంటి సినిమాలు ఫ్లాప్స్ గా నిలవడానికి ప్రేక్షకులే కారణం అని చెప్పక తప్పదు.

సినిమా కంటెంట్ బాగుండి అయినప్పటికి ఫ్లాప్స్ బాట పట్టిన సినిమాలనే అండరేటెడ్ మూవీస్ అంటారు.

అలాంటి అండరేటెడ్ మూవీస్ మన తెలుగులో కూడా చాలానే ఉన్నాయి.వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం !.

1.ఖలేజా సూపర్ స్టార్ మహెష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అనే చేపోచ్చు.

ఈ సినిమాలో మహెష్ కామిడీ టైమింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది.అలాగే మూవీలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్.

మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనిపించకుండా అద్భుత్సమైన స్క్రీన్ ప్లే తో దర్శకత్వం వహించారు త్రివిక్రమ్.

ఈ మూవీ ఎప్పుడు టీవిలో ప్రసారం అయిన.టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్ సాధిస్తుందటే ఈ మూవీని ఆడియన్స్ ఎంతలా అదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఈ మూవీ విడుదల అయినప్పుడు ఫ్లాప్ గా నిలిచింది.2.

జోష్ అక్కినేని నాగచైతన్య డెబ్యూ మూవీ గా వచ్చిన ఈ మూవీ కూడా విడదల అయినప్పుడు ఫ్లాప్ గా నిలిచింది.

కానీ టెలివిజన్ లో మాత్రం యూత్ ఈ సినిమాను ఇప్పటికీ ఆధారిస్తూనే ఉన్నారు.

మూవీలో స్టూడెంట్ గా నాగచైతన్య ఫర్ఫామెన్స్, సందీప్ చౌతా మ్యూజిక్ ఇప్పటి యూత్ ను కూడా కట్టిపడేస్తుంది.

ఒకవిధంగా చెప్పాలంటే యూత్ ఫేవరెట్ మూవీస్ టాప్ 5 లిస్ట్ లో జోష్ మూవీ తప్పకుండా ఉంటుంది.

కానీ విడుదల అయినప్పుడు మాత్రం ఈ మూవీ ఫ్లాప్ గా నిలవడం గమనార్హం.

"""/"/ 3.జగడం రామ్ పోతినేని హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా కల్ట్ క్లాసిక్ మూవీ అనే చేపవచ్చు.

యూత్ రౌడీఇజానికి అట్రాక్ట్ అవ్వడాన్ని ఈ మూవీలో సుకుమార్ చాలా బాగా చూపించారు.

మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే టెంపో లో స్క్రీన్ ప్లే సాగుతుంది.

ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు.

కానీ ఈ మూవీ కూడా విడుదల అయినప్పుడు ఫ్లాప్ గా నిలిచింది. """/"/ 4.

గౌతమ్ నంద గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి కూడా టీవి ఆడియన్స్ లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది.

ధనం మూలం ఇదం జగత్ అనే కన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ.

అద్భుతమైన స్క్రీన్ ప్లే తో కట్టిపడేస్తుంది.కానీ మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆశించినంత స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఫ్లాప్ గా నిలిచింది.

5.డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లు గా నటించిన ఈ మూవీ కూడా అండరేటెడ్ మూవీస్ లిస్ట్ లో ఒకటి అని చెప్పవచ్చు.

మూవీలో సున్నితమైన ప్రేమ కథతో పాటు అమ్మాయి తన గోల్ రిచ్ అవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంతుంది అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.

బుల్లితెరపై ఈ సినిమా టెలికాస్ట్ అయిన ప్రతిసారి టాప్ రేటింగ్ సంపాధిస్తుంది.కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది.

ఏపీ క్యాబినెట్ విస్తరణ.. వీరిని తప్పిస్తున్నారా ?