Anchor Ravi: రవి యాంకర్ కావడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. రెమ్యూనరేషన్ కూడా అంత తీసుకుంటున్నాడా?

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు రవి.

తన మాటల గారడీతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలు చేసాడు.

అలా ఒక క్రేజ్ తెచ్చుకున్న రవి.( Anchor Ravi ) యాంకర్ కావడానికి కారణం ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది.

ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.రవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకుందాం.

రవి చిన్నప్పుడు ఆర్మీ కి వెళ్ళాడట.కానీ అక్కడ ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చాడట.

ఇక ఆ సమయంలో చదువుకుంటూనే నటన మీద ఆసక్తి ఉండటంతో టీవీ యాంకరింగ్, సినిమాల్లో అవకాశాల కోసం తిరిగాడట.

అయితే మామూలుగా కొత్త టాలెంట్ ఉన్నవాళ్లను హీరో నాగార్జున( Nagarjuna ) ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు.

అలా ఓసారి రవి కూడా నాగార్జున దృష్టిలో పడటంతో ఆయన సపోర్టుతో మా మ్యూజిక్ లో యాంకర్ గా పరిచయమయ్యాడు.

"""/" / అలా సంథింగ్ స్పెషల్ షోతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో( Bigg Boss 5 ) అవకాశం అందుకున్నాడు.

"""/" / వెండితెరపై కూడా పలు సినిమాలలో చేశాడు.అలా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న రవి మొదట్లో పదివేల రెమ్యూనరేషన్ తీసుకోగా ఒక హోదాకి వచ్చేసరికి నెలకు 10 లక్షల కు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అలా హీరో నాగార్జున సపోర్టుతో అడుగుపెట్టి ఇప్పుడు లక్షలలో పారితోషకం తీసుకొని ఒక గుర్తింపును మోస్తున్నాడు.

ఇక రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.

నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు.తన ప్రాజెక్ట్ అప్డేట్ల గురించి కూడా బాగా పంచుకుంటూ ఉంటాడు.

ఇక ఈయనకు గతంలోని పెళ్లి కాగా పాప కూడా ఉంది.తన ఫ్యామిలీ ని కూడా పరిచయం చేశాడు రవి.

ఇక వాళ్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. """/" / ముఖ్యంగా ఆయన కూతురు మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక రవి ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు తన కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.

సమయం దొరికితే తన ఫ్యామిలీతో ట్రిప్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

దిగిన ఫోటోలు కూడా బాగా పంచుకుంటాడు.ఇప్పుడు ప్రస్తుతం పలు షో లలో బిజీగా ఉన్నాడు రవి.

వర్షంలో తడుస్తూ సహాయం చేసిన సోనూసూద్.. రియల్ హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!