నిత్యవసర ధరలు పెరగడానికి పాలకుల విధానాలే కారణం…!

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే నిత్యావసర సరుకుల( Essential Commodities ) రలు పెరిగి,పేద మధ్యతరగతి వర్గాలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదని సిపిఐ మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి ( Lakshmi )ఆరోపించారు.

మంగళవారం నేరేడుచర్ల పట్టణ కూరగాయల మార్కెట్లో మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి కూరగాయలు నిత్యవసర ధరలు పెంపుపై నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయని,కిలో టొమాటోలు రూ.

150 ధర పలకడం విస్మయానికి గురిచేస్తోందన్నారు.నెల రోజుల వ్యవధిలో బియ్యం ధర గంటకి 500 పెరిగిందని,రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వాలు,పెంచిన నిత్యవసర ధరలు ఎవరికోసమో చెప్పాలనినిలదీశారు.

పేద ప్రజలు కొనలేని పరిస్థితికి చేరిననిత్యావసర ధరలు తగ్గించే వరకు సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు సుజాత,రాములమ్మ, వెంకమ్మ,ఐలమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల అందరి చూపు ప్రభాస్ వైపే.. దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ !