బయటపడ్డ షర్మిల పార్టీ వెనుక ఉన్న అసలు కథ…

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఎవరూ ఊహించకుండా ఒక్కసారిగా షర్మిల పార్టీ ప్రకటన రావడం రాజకీయ వర్గాలను ఓ కుదుపు కుదిపేసిందని చెప్పవచ్చు.

కాని షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న అసలు కథ ఇప్పటికీ ఎవరికి తెలియ రాలేదు.

తరువాత పార్టీ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి, తెలంగాణలో రాజన్న రాజ్యం నా లక్ష్యమని షర్మిల తన పార్టీ వెనుక ఉన్న వ్యూహాన్ని ఎవరికి అర్థం కాకుండా జాగ్రత్త పడుతోంది.

అయితే ఇప్పుడు షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక అసలు కథ ఇదేనని ఓ వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లుకొడుతోంది.

షర్మిల పార్టీ తెరపైకి రావడానికి కేసీఆర్ వ్యూహంలో భాగమని, తెరపైకి టీఆర్ఎస్ పార్టీ బద్ద శత్రువులుగా రాష్ట్రంలో వ్యవహరించే అవకాశం ఉందని, తద్వారా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసి మరల ఎన్నికల్లో గట్టెక్కాలన్నది కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలా హిందూ మతం, క్రిస్టియన్ అని బీజేపీ, షర్మిల పార్టీ మధ్య మాటల తూటాలు పేలి బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా కుల, మత వైషమ్యాలు వచ్చి రాష్ట్రం ఆగమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కేసీఆర్ బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.

తద్వారా బీజేపీ మరల మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉంది.ఈ వ్యూహం గనుక విజయం సాధిస్తే మరల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండే అవకాశం ఉంది.

"""/"/.

రూ. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా.. వైఎస్ షర్మిల ఛాలెంజ్