ది రాజాసాబ్ మూవీ ఆడియో రైట్స్ లెక్కలివే.. ప్రభాస్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదేనంటూ?
TeluguStop.com
2025 సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రభాస్ , మారుతి ( Prabhas, Maruti )కాంబినేషన్ లో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీ ( The Rajasaab Movie )విడుదల కానుంది.
చాలా కాలం క్రితమే ఈ సినిమా షూట్ మొదలు కాగా ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ది రాజాసాబ్ మూవీ ఆడియో రైట్స్ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
ప్రభాస్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదేనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా 25 కోట్ల రూపాయలకు( 25 Crore For Rs ) అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఎలాంటి అప్ డేట్ వస్తుందో చూడాల్సి ఉంది.టీ సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకోగా ఈ మొత్తం 25 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
ఆడియో రైట్స్ ఇంత మొత్తనికి అమ్ముడవడం అంటే సాధారణమైన విషయం అయితే కాదనే చెప్పాలి.
"""/" /
ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆడియో రైట్స్ కు ఇంత డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది.
సాధారణంగా థమన్ పాటలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి.
ప్రభాస్ థమన్ కాంబోలో తొలి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో థమన్( Thaman ) ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉంటారు.
ప్రభాస్ ఈ సినిమాలో స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. """/" /
ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
ప్రభాస్ ను మారుతి ఈ సినిమాలో ఎలా చూపిస్తారో చూడాల్సి ఉంది.సినిమా సినిమాకు భిన్నమైన కథాంశాలను ప్రభాస్ ఎంచుకుంటున్నారు.
ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
టీచర్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాకే.. OMR షీట్స్ ఎలా చెక్ చేస్తున్నాడో మీరే చూడండి!