ఆ విషయంలో ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ.. !!

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుండి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అన్నీఇన్ని కావు.గత సంవత్సరం నుండి ఈ కరోనా వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా మాటల్లో వర్ణించలేము.

ఇక ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్ద అయితే చాలా క్లిష్టంగా మారింది.ప్రజారవాణ వ్యవస్దలో దాదాపు రైల్వే శాఖ కూడా వెనకడుగు వేసింది.

ఫలితంగా చాల రైళ్లు క్యాన్సల్ చేసిన రైల్వే శాఖ నామమాత్రంగా కొన్ని రైళ్లను మాత్రమే నడుపుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో రెగ్యులర్ రైళ్ల కోసం ఎందరో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.అయితే ఇలాంటి వారికి రైల్వే శాఖ షాకిచ్చింది.

దేశంలో కరోనా మళ్లీ వింజృభిస్తున్న క్రమంలో జులై వరకు రెగ్యులర్ రైళ్లు ప్రారంభించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పింది.

కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ చివరి వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మొత్తానికి తెలిసేది ఏంటంటే కరోనా వైరస్ ప్రజలను పీడించడం ఆగితే గానీ ప్రజా జీవనం గాడిలో పడదు.

నిజ్జర్ హత్య కేసు : కెనడా పోలీసుల అదుపులో ముగ్గురు భారతీయులు