తాలిబాన్ లకు వ్యతిరేకంగా లైవ్ లో సర్టిఫికెట్ చింపేసిన ప్రొఫెసర్..!!

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ సామ్రాజ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ లు తీసుకొస్తున్న చట్టాలు సంచలనంగా మారుతున్నాయి.

ఈ చట్టాలు అతి భయంకరం కావడంతో.చాలామంది దేశం విడిచి పారిపోయారు.

ఇదిలా ఉంటే ఆడవాళ్ళపై కఠిన ఆంక్షలు విధిస్తూ చదువుకు దూరం చేయటంతో పాటు ఉద్యోగం కూడా చేయకూడదని తాలిబాన్ లు  వ్యవహరిస్తున్న తీరుపై ఓ ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు.

కాబుల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో తన డిగ్రీ పట్టా సర్టిఫికెట్ చింపేశారు.

"నాకు డిగ్రీలు అవసరం లేదు.నా తల్లులు, సోదరీమణులు చదవలేకపోతే.

ఈ విద్యను నేను అంగీకరించను.అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 గతంలో కూడా ఇదే రీతిలో ఆడవాళ్లపై తాలిబాన్ లు కఠిన చట్టాలు తీసుకొచ్చారు.

అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్యం పరంగా ప్రభుత్వం ఏర్పడటంతో.ఆడవాళ్లు యధావిధిగా ఉన్నత చదువులు చదువుతూ మరోపక్క ఉద్యోగం చేసుకోవడం జరిగింది.

కానీ ఇప్పుడు మళ్లీ తాలిబాన్ లు దేశాన్ని పరిపాలిస్తూ ఉండటంతో ఆడవాళ్ళపై విధిస్తున్న ఆంక్షలు సంచలనంగా మారాయి.

కొరియన్ స్టార్ హృదయంలో నిలిచిన భారతీయ అభిమాని.. దశాబ్దం తర్వాత గుర్తుపట్టాడు..?