బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ స్కామ్స్ ని ఆధారాలతో సహా బయటపెట్టిన ‘ఎనిమల్’ నిర్మాత!

మన సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ ( Bollywood )లో హీరోల వర్షిప్ చాలా తక్కువగా ఉంటుంది.

సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు.మన సౌత్ లో లాగ హీరోలు అంటే వేరెక్కిపోవడం, హీరోలను దేవుళ్ళు లాగ కొలవడం వంటివి జరగవు.

ఇక్కడి లాగ కటౌట్స్ బ్యానర్స్ హుంగామ వంటివి బాలీవుడ్ లో అసలు ఉండదు.

అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మన సౌత్ స్టార్ హీరోలకు జరిగే రేంజ్ లో పావు శాతం కూడా బాలీవుడ్ స్టార్ హీరోలకు జరగదు.

కానీ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) గత రెండు సినిమాలకు మాత్రం విడుదలకు ముందు అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

అసలు బాలీవుడ్ సినిమాకి ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఏమిటి?, అసలు ఎలా సాధ్యం అని అందరూ అనుకున్నారు.

కానీ అదంతా ఫేక్ అని కార్పొరేట్ బుకింగ్స్ అని సోషల్ మీడియా లో కొంతమంది లీక్ చేసారు.

"""/" / రీసెంట్ గా 'ఎనిమల్'( Animal ) మూవీ నిర్మాత ప్రణయ్ కుమార్ రెడ్డి( Pranai Kumar Reddy ) (సందీప్ వంగ అన్నయ్య) ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ లో ఆయన బాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కి కొన్ని కార్పొరేట్ సంస్థలతో డీల్ ఉంటుంది.

యాడ్స్ చేసేటప్పుడు షారుఖ్ వంటి వారు ముందుగా ఇలాంటి డీలింగ్స్ కూడా పెట్టుకుంటారు.

రెమ్యూనరేషన్ తో పాటుగా, కార్పొరేట్ సంస్థలు అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ కూడా కొనుగోలు చేస్తాయి.

అలా అత్యధికంగా టికెట్స్ కొనుగోలు చేసి, అధిక గ్రాస్ చూపించడం వల్ల సినిమాకి ఇంత క్రేజ్ ఉందా అని ఆడియన్స్ అనుకోవాలని ఇలా చేస్తారు అని ప్రణయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాదు, ఒక బాలీవుడ్ సినిమాకి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి అంటే అది కచ్చితంగా కార్పొరేట్ బుకింగ్స్, అక్కడి ఆడియన్స్ 90 శాతం కౌంటర్ బుకింగ్స్ లో టికెట్స్ కొనుగోలు చేస్తారు అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.

"""/" / ఎనిమల్ చిత్రం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.

'సలార్' చిత్రం వచ్చినప్పటికీ కూడా ఎనిమల్ జోరు ఏమాత్రం తగ్గలేదు.కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ సినిమా చాలా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది.

థియేటర్స్ లో ఈ రేంజ్ లో అలరించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీ లో కూడా విడుదల కాబోతుంది.

ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు.. ఈ విద్యార్థుల సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!