స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పక్రియను పారదర్శకంగా అమలు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్( Local Body Elections ) లో రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శంగా అమలు చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్( Praveen Kumar ) కోరారు.

గతంలో చాలా గ్రామాల లో రిజర్వేషన్ల పక్రియ సజావుగా లేక ఎస్సి ఎస్టీ బిసి లకు తీవ్ర అన్యాయం జరిగిందని.

దిని వల్ల ఆయా సామజిక వర్గం లో చదువుకున్న యువకులు నిరాశ మిగిలిందనీ అన్నారు.

రిజర్వేషన్ అమలు చేయడం లో ఎలాంటి రాజకీయ ఒత్తిడికి గురి కాకుండా న్యాయ బద్దంగా జనాభా దామాషా ప్రకారం ఎస్సి ఎస్టీ బిసి లకు ఎంత చెందలో అంత అమలయ్యే విధంగా రిజర్వేషన్ లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

కొన్ని గ్రామాలలో అయితే గాత 30 సంవత్సరాలుగా 50 % జనాభా ఒక సామజిక వర్గం ఉన్న ఇప్పటి వరకు హా వర్గానికి రిజర్వేషన్ కేటాయించక పోవడం చాలా బాధాకరం అని , ఇలాంటి విషయములో రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉందని అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు, అలగే జెండర్ విషయములో కూడా అనేక గ్రామాల్లో పొరపాట్లు జరిగాయని ఇలాంటివి మళ్ళీ పునవృతం కాకుండా చూడాలని అన్నారు ,ఇప్పటికి అయిన వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్( Reservation ) పక్రీయ అన్ని సామాజిక వర్గాలు సంతృప్తి పడే విధంగా పారదర్శకతో రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం ల నాయకులు మాసం సుమన్ , ఎరవెల్లి విజయ్ , సందీప్,సురేష్, ప్రశాంత్,శ్రీను, బాబు, తదితులురు పాల్గోన్నారు.

బీజింగ్‌లో గాంధీ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస భారతీయులు