రాజన్న సిరిసిల్ల జిల్లాలో సజావుగా జరుగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ కొనసాగుతుంది.సిరిసిల్ల నియోజకవర్గం కు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో , వేములవాడ నియోజకవర్గం కు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పంపిణీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది ఇక ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు అందజేస్తున్నారు.
పోలింగ్ సిబ్బంది ఈరోజు ( బుధవారం) సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు.బుధవారం సిరిసిల్ల, వేములవాడ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు.
అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..