పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలి ..జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
TeluguStop.com
ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల కోసం ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
కలెక్టర్ వెంట సిరిసిల్ల, వేములవాడ రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్ మధు సూదన్ లు ఉన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ ను పరిశీలించారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం ఇది వరకే దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ మలయాళ హీరోతో తెలుగు హీరోలకు ముప్పు తప్పదా..?